IPL 2026: వైభవ్ సూర్యవంశీ కొత్తేం కాదు.. మేము స్ట్రాంగ్గా ఉన్నాం.. మీకేందుకు టెన్షన్

IPL 2026: వైభవ్ సూర్యవంశీ కొత్తేం కాదు.. మేము స్ట్రాంగ్గా ఉన్నాం.. మీకేందుకు టెన్షన్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఇవాళ( 2026, ఏప్రిల్ 7న) మరో పోరుకు రంగం సిద్ధమైంది. గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్(Mumbai vs Rajasthan) మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో వరుస విజయాలతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేయాలనే కసితో ఆర్ఆర్ ముందుకు సాగుతుంది. మరోవైపు, ముంబై రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ, ముంబై స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా కాంబినేషన్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వేచి చూస్తున్నారు. 

ఈ మ్యాచ్‌కు సంబంధించి పలు విషయాలను ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మీడియాతో మాట్లాడాతూ.. వైభవ్ సూర్యవంశీ వల్ల కలిగే ముప్పు కొత్తదేనా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. వైభవ్‌ (Vaibhav Sooryavanshi) ఆట తమకు కొత్తేం కాదని ఆన్సర్ ఇచ్చాడు. ఐపీఎల్‌ (IPL 2026)లో అతడికి ఇది రెండో సీజన్‌ మాత్రమే.. కానీ చాలా బాగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీకి వైభవ్ విలువైన ఆటగాడని, అతడి ఆటతీరు తమకు కొత్తేం కాదన్నాడు. అలానే వైభవ్‌ విషయంలో ముంబై జట్టు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు.

ALSO READ : బీసీసీఐ తప్పుడు నిర్ణయాలు..

ఇతర ప్లేయర్స్ ని ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవుతామో వైభవ్‌ విషయంలోనూ అలాగే ఉంటామని బౌలింగ్ కోచ్ పరాస్‌ చెప్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ గురించి కూడా తమకు పెద్దగా ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాడు. రవిని మిస్టరీ స్పిన్నర్‌ అని తాము భావించట్లేదు.. గత కొన్నేళ్లుగా ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడో.. ఈ ఏడాది అలాగే ఉంది.. మ్యాచ్ ప్రారంభం అయ్యాక స్టేడియంలో ఏదైనా జరగొచ్చు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ జట్టు రెడీగా ఉందని పరాస్ వెల్లడించాడు.