Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో సంచలన మార్పులు.. కొత్త బాస్‌గా తమీమ్ ఇక్బాల్

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో సంచలన మార్పులు.. కొత్త బాస్‌గా తమీమ్ ఇక్బాల్

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)లో ఇవాళ (2026, ఏప్రిల్ 7వ తేదీన) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రికెట్ బోర్డులో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను బీసీబీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ (NSC) ఉత్తర్వులు జారీ చేసింది. 37 ఏళ్ల తమీమ్, ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 

బోర్డు రద్దుకు గల కారణాలు ఇవే:
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బీసీబీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో బంగ్లా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికలో ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం నేతృత్వంలోని డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తున్నట్లు నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ (NSC) ప్రకటించింది.

11 మందితో అడ్-హాక్ కమిటీ:
బీసీబీ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక (అడ్-హాక్) కమిటీని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కీలక సభ్యులుగా:
రష్నా ఇమామ్, మీర్జా యేసిర్ అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఇస్రాఫిల్ ఖస్రు, తంజిల్ చౌదరి, సల్మాన్ ఇస్పాహానీ, రఫీకుల్ ఇస్లాం, ఫాహిమ్ సిన్హా ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

అడ్-హాక్ టార్గెట్: 
ఈ అడ్-హాక్ కమిటీ ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టింది. 
* నూతన ఎన్నికలు: రాబోయే 90 రోజుల్లో పారదర్శక పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి కొత్త బోర్డును ఎన్నుకోవడం.
* అంతర్జాతీయ సహకారం: ఈ మార్పుల గురించి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి సమాచారం అందించేసి.. వారి నుంచి వచ్చే స్పందన కోసం బోర్డు వేచి చూస్తోంది.
* టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డులో చోటు చేసుకున్న ఈ మార్పులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమీమ్ సారథ్యంలో బోర్డు ప్రక్షాళన జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.