పండుగ సీజన్​లో 5 లక్షల జాబ్స్​

పండుగ సీజన్​లో 5 లక్షల జాబ్స్​
  • ఇవ్వనున్న ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎందుకంటే కరోనా తరువాత అన్ని రకాల వస్తువులకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ సీజనల్ అవసరాల కోసం జనం పెద్ద ఎత్తున షాపింగ్​ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్​లో ఆన్​లైన్​ షాపింగ్ ప్లాట్​ఫారాలకు భారీగా గిరాకీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ వంటివి పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. స్టాఫింగ్ కంపెనీ మ్యాన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఇండియా స్టడీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్– నవంబర్ మధ్య అత్యధిక సంఖ్యలో 5,00,000–5,50,000 కొత్త తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రిటైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్​ఎస్ఐ) వంటి రంగాలలోని కంపెనీలు పెద్ద ఎత్తున జాబ్స్​ఇస్తాయి. "కంపెనీలు తమ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ రెండింటి అమ్మకాల్లోనూ భారీ గ్రోత్​ఉంటుందని ఆశిస్తున్నందున మ్యాన్​పవర్​ను బలోపేతం చేయడంలో బిజీగా ఉన్నాయి. ‘‘మెజారిటీ జనం కరోనా టీకాలు వేసుకున్నాక వస్తున్న పండుగ సీజన్ ఇది. కొవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు. ప్రయాణాలు పెరిగాయి. మహమ్మారి భయం తగ్గింది” అని మ్యాన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఇండియాలో సేల్స్, అకౌంట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ గ్లోబల్ అకౌంట్స్ సీనియర్ డైరెక్టర్ అలోక్ కుమార్ అన్నారు. 

25 శాతం పెరుగుదల
పోయిన ఏడాది పండుగ నెలలతో పోలిస్తే ఈసారి జాబ్స్​ దాదాపు 20–25 శాతం పెరుగుతాయని అంచనా. డెలివరీ, లాజిస్టిక్స్, వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్ విభాగాల్లో దాదాపు 70 శాతం డిమాండ్ లేదా 3,50,000 కొత్త ఉద్యోగాలు ఉంటాయని చెబుతున్నారు. అమెజాన్, షాడోఫాక్స్, ఈకామ్​ఎక్స్​ప్రెస్, ఫ్లిప్​కార్ట్​వంటి సంస్థలు తమ లాస్ట్​ మైల్​టీమ్​లను బలోపేతం చేస్తున్నాయి. ఫ్లిప్​కార్ట్, అజియో, జెప్టో, స్విగ్గీ, జొమాటో, డోమినోస్​వంటి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లతో పని చేస్తున్న లాజిస్టిక్​కంపెనీ షాడోఫాక్స్​టెక్నాలజీస్, రాబోయే మూడు నెలల్లో 1,05,000 డెలివరీ ఏజెంట్లను నియమించాలని భావిస్తోంది. ఇది ఒక సంవత్సరం క్రితం జాబ్స్​తో పోలిస్తే దాదాపు రెట్టింపు. "ఫ్యాషన్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్/మొబైల్ ఫోన్లు, పుస్తకాలు, కిరాణా సామాగ్రి, ఆహారం, గృహోపకరణాలు, బేబీ ఉత్పత్తులతో సహా చాలా రకాల ప్రొడక్టులకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావొచ్చు" అని షాడోఫ్యాక్స్ కో–ఫౌండర్, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రహర్ష్ చంద్ర అన్నారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ డెలివరీ కోసం 55,000 మందిని నియమించుకోవాలని ఈకామ్ అనుకుంటోంది. సంవత్సరం క్రితం ఇది 35,000 మందికి జాబ్స్​ ఇచ్చింది. "అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఇస్తాం. దేశంలోని చిన్న సిటీలు, పట్టణాలు మారుమూల ప్రాంతాల నుండి  ఆర్డర్లలో భారీ పెరుగుదలను ఆశిస్తున్నాం" అని ఈకామ్​ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆశిష్ సిక్కా అన్నారు. 

అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్​ మాట్లాడుతూ "2021లో మా సంస్థ1,10,000 కంటే ఎక్కువ టెంపరరీ జాబ్స్​ ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా, పెద్ద ఎత్తున సీజనల్ అసోసియేట్‌‌‌‌‌‌‌‌లను తీసుకుంటాం” అని ఆయన వివరించారు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఫ్లిప్​కార్ట్​ స్పందించలేదు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్‌‌‌‌‌‌‌‌లో పెరుగుదల వల్ల టెంపరీ జాబ్స్​పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని టీమ్​లీజ్​సర్వీసెస్​కు చెందిన రీతుపర్ణ చక్రవర్తి అన్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిటైలర్లు స్పీడ్ ​డెలివరీ, క్విక్​ కామర్స్​ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తీర్చడానికి నియామకాలను కొనసాగిస్తాయని వివరించారు. లాస్ట్ మైల్ డెలివరీ ఏజెంట్లతోపాటు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు, ఫైనాన్సింగ్, లోన్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు, బ్యాక్-ఎండ్ సపోర్ట్ కోసం డిమాండ్​ ఉంది. మన దేశంలో పండుగల సీజన్ ఆగస్టులో రక్షా బంధన్, జన్మాష్టమి గణేష్ చతుర్థితో ప్రారంభమవుతుంది. ఇది దుర్గా పూజ/నవరాత్రి, దీపావళి  క్రిస్మస్ (డిసెంబరు) వరకు కొనసాగుతుంది.