ఐటీలో పెరిగిన హైరింగ్..

ఐటీలో పెరిగిన హైరింగ్..

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో హైరింగ్ చేపడుతున్న ఐటీ కంపెనీలకు పెరుగుతున్న అట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉద్యోగులు జాబ్‌‌‌‌‌‌‌‌ మానేయడం), ఉద్యోగులు ఖర్చులు, మార్జిన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గుతుండడం వంటి అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– జూన్‌‌‌‌‌‌‌‌  మధ్య  టీసీఎస్‌‌‌‌‌‌‌‌, విప్రో, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌లు  నికరంగా 50 వేల మందిని హైర్ చేసుకున్నాయి. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ట్యాలెంట్ ఉన్నవారి కోసం ఐటీ కంపెనీల వెతుకులాట ఇంకా కొనసాగుతుందని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. సరిపడినంత మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నంత వరకు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందని చెప్పారు. డిమాండ్ పెరగడంతో వేకెన్సీలను నింపుకోవడంలో ఐటీ కంపెనీలు, బిజినెస్‌‌‌‌‌‌‌‌లు డిజిటల్‌‌‌‌‌‌‌‌గా మారడంతో నాన్‌‌‌‌‌‌‌‌–టెక్ కంపెనీలు కూడా ఐటీ ఉద్యోగులను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. దీంతో ఐటీ  డస్ట్రీలో ట్యాలెంట్ ఉన్న ఉద్యోగుల కొరత కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా యూఎస్‌‌‌‌‌‌‌‌, యూరప్‌‌‌‌‌‌‌‌లలో టెక్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ బాగానే ఉందని, దీంతో టాప్ ఐటీ కంపెనీలు పూర్తి ఏడాదికి గాను తమ హైరింగ్ టార్గెట్‌‌‌‌‌‌‌‌లను మార్చలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు ఐటీ ఇండస్ట్రీలో క్రియేట్ అవుతాయని టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌ సీఈఓ సునిల్‌‌‌‌‌‌‌‌ అంచనా వేశారు. 

ఖర్చు తగ్గించుకుంటేనే..

హైరింగ్‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీ బాగా పెరిగినందుకు టెక్ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ ఆనందంగా ఉన్నా, అట్రిషన్ రేటు పెరగడం, ఉద్యోగుల ఖర్చు ఎక్కువవ్వడం,  ఉద్యోగులు ఒకే సారి రెండు మూడు జాబ్‌‌‌‌‌‌‌‌లు చేస్తుండడం వంటి అంశాలు కంపెనీలను ఇబ్బంది పెడుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలు తమ వేరియబుల్ పే (ఉద్యోగుల ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే పే) ను తగ్గించేశాయి. కంపెనీల మార్జిన్స్‌‌‌‌‌‌‌‌ పై ఒత్తిడి పెరుగుతోందని, గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా బిజినెస్‌‌‌‌‌‌‌‌ నెమ్మదించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఖర్చులు ఎక్కువవ్వడంతో షార్ట్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌లో ఐటీ కంపెనీల మార్జిన్స్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి కొనసాగుతుంది.  కంపెనీలు తమ ఉద్యోగులు ట్యాలెంట్‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా వాడుకుంటే, ఖర్చులను తగ్గించుకుంటే  మార్జిన్స్‌‌‌‌‌‌‌‌  మెరుగుపడతాయి’ అని సునిల్ పేర్కొన్నారు.