క్రోయేషియాలో మంగళవారం రాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..20 మందికి గాయాలయ్యాయి. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌కు దక్షిణాన సుమారు 50 కిలోమీటర్ల (30 మైళ్ళు) దూరంలో ఉన్న పెట్రింజా అనే పట్టణంలో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 నమోదయింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు కుప్పకులాయి. జనాలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. భారీగా నష్టం జరిగినట్లు గుర్తించారు అక్కడి అధికారులు. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను బయటకు తీశాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామని.. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ చెప్పారు.
తల్లిదండ్రులపై కొడుకు దాడి..తల్లి మృతి
