భోపాల్: యువ నటి ట్విషా శర్మ 2026, మే 12న చనిపోయారు. భోపాల్‌లోని ఆమె అత్తగారింట్లో ఉరి వేసుకుని అనుమానస్పదస్థితిలో మరణించారు. తమ కూతురిని ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ట్విషా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ట్విషా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు.. ఆమె మృతదేహానికి భోపాల్ ఎయిమ్స్‌లో వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అటాప్సీ రిపోర్టులో ట్విషాది ఆత్మహత్యే అని తేలింది. పోలీసులు కూడా నటిది సూసైడేనని నిర్ధారించారు. వర కట్నం కోసం వేధించి ఆత్మహత్యకు ఏమైనా ప్రేరేపించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కానీ ట్విషా మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తో్న్న పేరేంట్స్ కూతురి డెడ్ బాడీ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో 8 రోజులుగా ట్విషా మృతదేహం భోపాల్ ఎయిమ్స్ మార్చురీలోనే ఉంది. తమ కుమార్తె మరణంపై నిష్పక్షపాతమైన, స్వతంత్రమైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తన కూతురి మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్‌లో రీ పోస్ట్ మార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని భోపాల్ లోకల్ కోర్టును ఆశ్రయించారు. ట్విషా శర్మ అత్తమామలకు అపారమైన ఆర్థిక, రాజకీయ పలుకుబడి ఉందని.. భోపాల్‌లో జరిగిన ప్రాథమిక శవపరీక్ష రాజీపడి అసంపూర్ణంగా జరిగిందని వారు ఆరోపించారు.
►ALSO READ | 59 ఏండ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్.. విజయ్ కేబినెట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కానీ కోర్టులో ట్విషా పేరేంట్స్‌కు నిరాశ ఎదురైంది. ట్విషా డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కోర్టు అంగీకరించలేదు. ట్విషా డెడ్ బాడీని భద్రపర్చడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. ట్విషా మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు భోపాల్ పోలీసులు లేఖ రాశారు. మృతదేహాన్ని ఎక్కువ కాలం భద్రపరిస్తే అది కుళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మృతదేహాన్ని నిల్వ చేసే సామర్థ్యం భోపాల్ ఎయిమ్స్‌లో లేదని వైద్యులను ఉటంకిస్తూ పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు.. ట్విషా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌ను కలిశారు. ట్విషా మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. ట్విషా మరణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామని మృతురాలి కుటుంబ సభ్యులకు సీఎం హామీ ఇచ్చారు. కానీ, ట్విషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టానికి భోపాల్ కోర్టు నిరాకరించడం, డెడ్ బాడీ తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు కోరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గత 8 రోజులుగా మార్చురీలోనే ఉన్నా ట్విషా విషయంలో ఆమె పేరెంట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలీ.
