90‌‌ఏళ్ల బామ్మకు కరోనా … తొలి వ్యాక్సిన్ ను అందించిన డాక్టర్లు

90‌‌ఏళ్ల బామ్మకు కరోనా … తొలి వ్యాక్సిన్ ను అందించిన డాక్టర్లు

కరోనా కు చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా సంస్థ తన వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు సాధారణ ప్రజలు వినియోగించుకునేలా బ్రిటన్ అందుబాటులోకి తెచ్చింది. మూడు దశల్లో ఫైజర్ ను క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించగా.. 95 శాతం మేర సత్ఫలితాలు వచ్చాయని .. వ్యాక్సిన్ విడుదల చేసేలా అనుమతి కావాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి అమెరికా ప్రతిపాదనలను పంపించింది. వ్యాక్సిన్ సత్ఫలితాలపై సుముఖంగా ఉన్న బ్రిటన్.. ఫైజర్ వ్యాక్సిన్ ను  సాధారణ ప్రజల అందుబాటులోకి తెస్తూ అనుమతులిచ్చింది. ఈ సందర్భంగా ఫైజర్ తొలి వ్యాక్సిన్‌ను మార్గరెట్ కీనన్ అలియాస్ మ్యాగీ అనే 90ఏళ్ల వృద్ధురాలికి ఇచ్చారు.

కరోనా సోకి సెంట్రల్ లండన్‌లోని కోవెంట్రీలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు ఆమెకు తొలి వ్యాక్సిన్‌ను ఇచ్చారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఉందని డాక్టర్లు చెప్పారు.

కాగా ప్రాధాన్యతన బట్టి వ్యాక్సిన్ ను వయస్సుల వారీగా వినియోగిస్తారు.  తొలత 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తొలి డోసులను అందిస్తారు.  అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్లు, క్రమంగా పిల్లలు, మహిళలు అనంతరం 50 సంవత్సరాలు పైనున్న వయస్సు గల కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్‌ను ఇస్తారు.