అనాధ పిల్లలకోసం ఫ్రీగా కేక్స్‌‌ పంచుతున్న బేకరీ యజమాని

అనాధ పిల్లలకోసం ఫ్రీగా కేక్స్‌‌ పంచుతున్న బేకరీ యజమాని

లైఫ్‌‌లో అన్నీ అందరికీ దొరకవు కదా! అలాంటి వాళ్లకోసం ఏ స్వార్ధం లేకుండా కొందరు చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు. అలా, ఒక బేకరీ యజమాని చేస్తున్న సాయాన్ని ఐఎఎస్ ఆఫీసర్‌‌‌‌ అవనీష్‌‌ శరణ్‌‌ తన ట్విట్టర్‌‌‌‌ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేశాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

డబ్బులుంటే కావాల్సింది కొనుక్కొని తింటారు. కానీ, అనాథ, బిక్షాటన చేసే పిల్లలు అలా కాదు. వాళ్ల దగ్గర డబ్బు ఉండదు. అందుకని వాళ్లకు తినాలనిపించింది తినలేరు. ఫుడ్‌‌ స్టాల్స్‌‌, బేకరీల పక్కన నిలబడి ఎవరైనా ఏదైనా తింటుంటే వాళ్లనే చూస్తుంటారు చాలామంది. రోజూ తన బేకరీ దగ్గర నిలబడే అలాంటి పిల్లలను చూసి బాధపడేవాడు ఉత్తర్‌‌‌‌ ప్రదేశ్‌‌, దేవరియాలోని ఒక బేకరీ ఓనర్‌‌‌‌. అందుకే తన బేకరీలో 14 ఏండ్లలోపు అనాధ పిల్లలకోసం ఫ్రీగా కేక్స్‌‌ పంచడం మొదలుపెట్టాడు. దానికోసం బోర్డు కూడా పెట్టించాడు. అందులో ‘ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మా దగ్గర 14 ఏండ్లలోపు అనాధ పిల్లలకు కేక్స్‌‌ ఫ్రీగా ఇస్తాం’ అని రాసి ఉంది. వాళ్లకోసం తనకు తోచిన సాయం చేస్తున్న బేకరీ యజమానిని సోషల్ మీడియాలో పొగుడుతున్నారంతా. ఇప్పటివరకు ఈ పోస్ట్‌‌ని 3,000 మంది రీ ట్వీట్‌‌ చేయగా, 30,000ల లైక్స్ వచ్చాయి.