పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్‌‌ లిమిట్‌‌

పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్‌‌ లిమిట్‌‌

వాతావరణ మార్పులు– ఇంపాక్ట్స్‌‌ మీద ఆందోళనలు పెరుగుతుండడంతో 2015లో 195 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం.. ఈ శతాబ్దం చివరినాటికి భూఉష్ణోగ్రతలు తగ్గించాలి. అది.. ప్రి– ఇండస్ట్రియల్ లెవెల్స్‌‌తో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌‌కు మించకూడదు. కానీ ఈ ఒప్పందం లక్ష్యం మాత్రం పెరుగుదలను1.5 డిగ్రీల సెల్సియస్‌‌కు మించకుండా చేయడం.

అయితే.. ఈ ఒప్పందంలో ప్రి–ఇండస్ట్రియల్ లెవెల్స్‌‌ ఎంత అనేది చెప్పలేదు. సైంటిస్ట్‌‌లు మాత్రం1850 నుండి 1900 వరకు సంవత్సరాలను బేస్‌‌లైన్‌‌గా పరిగణిస్తారు. అయితే.. 1.5 డిగ్రీల సెల్సియస్ లిమిట్‌‌గా పెట్టడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే అంతకు మించితే.. అది చాలా ప్రమాదాలకు దారితీస్తుందని నిర్ధారించారు సైంటిస్ట్‌‌లు. అందువల్ల 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని ‘‘డిఫెన్స్‌‌ లైన్‌‌”గా సెట్ చేయాలని నిర్ణయించారు. 


ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రి–ఇండస్ట్రియల్ లెవెల్స్‌‌ కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే.. ప్రజల మీద కోలుకోలేని ఎఫెక్ట్‌‌ పడుతుందని చెప్తున్నారు. ఇంటర్‌‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ప్రకారం.. 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటితే.. అనేక ప్రాంతాలలో భారీ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో కరువు పెరుగుతుంది. మహాసముద్రాలు విపరీతంగా వేడెక్కుతాయి.

బలమైన హరికేన్‌‌లు తీరప్రాంతాలను అతలాకుతలం చేస్తాయి. ఇవేకాకుండా ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.  ప్రపంచ వాతావరణ సంస్థ 2023లో ఇచ్చిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్‌‌ ప్రకారం.. 2023నుంచి 2027 మధ్య కనీసం ఒక ఏడాది1.5 లిమిట్‌‌ని దాటే అవకాశం 66 శాతం ఉందని చెప్పింది. 2023 ఇప్పటికే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏడాదిగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేసింది. కాగా... 2023లో ఈ లిమిట్‌‌ సగటు ప్రి–ఇండస్ట్రియల్‌‌ లెవల్‌‌ కంటే.. 1.48 డిగ్రీల సెల్సియస్ పెరిగింది.