పుష్ప 2 సెట్ నుంచి వీడియో వైరల్..

పుష్ప 2 సెట్ నుంచి వీడియో వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పుష్ప2(Pushpa2) ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మేకర్స్. 

లేటెస్ట్గా పుష్ప2 షూటింగ్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అడవిలో పుష్ప లారీలు..ఒకటి కాదు కొన్ని వందల లారీలు.. ఎర్ర చందనం దుంగలతో ఉన్న వీడియో బయటకి వచ్చింది.ఈ లీక్తో సుకుమార్ మానియా ఏంటనేది అర్ధం అవుతుంది.ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ను మించిన హైటెక్ స్మగ్లింగ్ ఐడియాస్ పుష్ప2 నుంచి  ఆశించవచ్చు.ఇప్పటికే  అల్లు అర్జున్ నేషనల్ అవార్డుతో మంచి ఊపు మీద ఉన్నాడు.దీంతో ఐకాన్ స్టార్  మరి ఎక్కువ హుషారుతో ఆడియన్స్ను ఫిదా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్. 

రీసెంట్గా పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఇంత భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సౌత్ ఇండస్ట్రీల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఆఫర్ రాలేదు. ఈ ఒక్క న్యూస్ తో దేశవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై క్రేజ్ ఎలా ఉందొ అర్థమవుతోంది. 

ALSO READ:మహేష్ కోసం పవన్ వస్తున్నాడు.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్!

ఇక పుష్ప2 విషయానికి వస్తే.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రిలీజ్కు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.