మార్కెట్‌లోకి ఊరోళ్లు వచ్చేస్తున్రు

మార్కెట్‌లోకి ఊరోళ్లు వచ్చేస్తున్రు
  • కొత్తగా డీమాట్ అకౌంట్లు తెరుస్తున్నారు
  • 25–35 ఏజ్‌‌ గ్రూప్ వారు ఎక్కువగా ఇన్వెస్ట్‌‌మెంట్లు
  • జెరోధా కో ఫౌండర్,సీఐఓ నిఖిల్ కామత్

వెలుగు, బిజినెస్‌‌‌‌డెస్క్ : చిన్న పట్టణాల నుంచే డీమాట్ అకౌంట్లు ఎక్కువగా తెరుస్తున్నారని..మరీ ముఖ్యంగా 25–35 వయసును వారే కొత్తగా మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నట్టు జెరోధా కో ఫౌండర్,  సీఐఓ నిఖిల్ కామత్ చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గత పదేళ్లలో 12 శాతం నుంచి 13 శాతం శ్రేణిలో వృద్ధి చెందిన క్రమంలో చాలా మంది యువతకు ఈ రిటర్నులు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొన్నారు. ఈటీనౌకు నిఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..

నెక్ట్స్ జనరేషన్ ఇన్వెస్టర్లు వస్తున్నారా..? డీమాట్ అకౌంట్లు ఎక్కడి నుంచి ఎక్కువగా తెరుస్తున్నారు?

జెరోధా వద్ద డీమాట్ అకౌంట్లు తెరిచే వారిలో మెజార్టీ 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారే. కొత్త వారే ఎక్కువగా మార్కెట్‌‌‌‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ గ్రూప్ యావరేజ్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉద్యోగానుభవం ఉండి.. ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు సంపాదిస్తున్న వారే ఉన్నారు.

భౌగోళిక పరంగా ఎక్కడి నుంచి డీమాట్ అకౌంట్లు ఎక్కువగా తెరుస్తున్నారు..?

ఎప్పటి మాదిరిగానే టైర్ 1 నగరాలు ముందంజలో ఉన్నాయి. ముంబై నెంబర్‌‌‌‌‌‌‌‌ 1లో ఉండగా.. ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలున్నాయి. టైర్ 2,3 నగరాల నుంచి ఎక్కువగా డీమాట్ అకౌంట్లు తెరిచేందుకు చూస్తున్నారు. గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో చిన్న పట్టణాల నుంచి తమకు ఎక్కువగా బిజినెస్‌‌‌‌లు వస్తున్నాయి.

ఈ అకౌంట్లు ట్రేడింగ్ కోసం ఓపెన్ చేస్తున్నారా..? స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఏర్పడిందా..?

గత ఐదేళ్ల కాలాన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్, బంగారం కంటే స్టాక్ మార్కెట్లే మెరుగైన ప్రదర్శనను కనబర్చాయి. ఇతర అసెట్ క్లాస్‌‌‌‌లతో పోలిస్తే.. స్టాక్ మార్కెట్లే మరింత లిక్విడిట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఏ సమయంలోనైనా పెట్టుబడిని పెట్టొచ్చూ.. తీసేయొచ్చూ.. ఈ ఫర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌నే భవిష్యత్‌‌‌‌లో కూడా స్టాక్ మార్కెట్లు కొనసాగిస్తాయి. గత పదేళ్లలో స్టాక్ మార్కెట్లు తమ బెంచ్‌‌‌‌ మార్క్ స్థాయిలకు 12 శాతం నుంచి 13 శాతం వరకు వృద్ధి సాధించాయి. ఈ రిటర్నులు మార్కెట్‌‌‌‌లోకి కొత్తగా ఎంటర్‌‌‌‌‌‌‌‌ అవుతున్న 25–35 వయసున వారికి ఎక్కువ ఆకర్షణీయంగా మారాయి.

ఎన్ని డీమాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు..? ఎంత శాతంలో అవి వృద్ధి సాధించాయి..? అయితే యాక్టివ్ అకౌంట్లు తగ్గాయని తెలిసింది..? అలాంటి ట్రెండేమన్నా ఉందా..?

జెరోధాకు ఇండియాలో పెద్ద మొత్తంలో యాక్టివ్ అకౌంట్లున్నాయి. 10 లక్షల మార్క్‌‌‌‌ను మేము క్రాస్ చేశాం. సగటున 50 వేల నుంచి 70 వేల కొత్త అకౌంట్లు జెరోధా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పైకి వస్తున్నాయి. ఈ అకౌంట్లలో చాలా వరకు తొలిసారి మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్న వారే. స్టాక్ మార్కెట్‌‌‌‌లోకి వస్తున్న వారు కూడా భిన్న తరగతికి చెందిన వారు. అనుభవమున్న పాత వారు ఒక బ్రోకర్ నుంచి మరో బ్రోకర్‌‌‌‌‌‌‌‌కు మారిపోతున్నారు. 10 శాతం కంటే తక్కువ పాపులేషన్‌‌‌‌కే ఫైనాన్సియల్ మార్కెట్లపై ఎక్స్‌‌‌‌పోజర్‌‌‌‌ ఉంటుంది. ప్రజలకు ఆర్థికంగా మరింత అవగాహన ఉండాలి. ‌‌‌‌మరింత మంది స్టాక్‌‌‌‌ మార్కెట్లలోకి ఎంటర్ కావాలి. తమ సేవింగ్స్‌‌‌‌లో కొంత స్టాక్ మార్కెట్లపై పెట్టాలి.

కొత్త డీమాట్ అకౌంట్లు ఓపెన్ చేసినా.. వాటిని వాడటం లేదని తెలిసింది.. పాత అకౌంట్లు కూడా ఫంక్షనింగ్‌‌‌‌లో లేవని తెలిసింది.. వాటి సంగతేంటి?

మీరు ఇన్వెస్టర్ అయితే.. ఒకసారి ఇన్వెస్ట్ చేశాక.. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత మళ్లీ వచ్చి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ పెట్టాల్సినవసరం లేదు. కానీ మీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. అప్పుడు మీ అకౌంట్‌‌‌‌ యాక్టివ్‌‌‌‌లో ఉండాల్సినవసరం లేదు.