V6 News

జాతీయ జెండా రంగుల్లో ఫుడ్ ను సర్వ్ చేస్తోన్న రెస్టారెంట్

జాతీయ జెండా రంగుల్లో ఫుడ్ ను సర్వ్ చేస్తోన్న రెస్టారెంట్

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా పలువురు పలు రకాలుగా దేశభక్తిని చాటుకుంటున్నారు. అందులో భాగంగా గోరఖ్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్ ఓనర్ కూడా ఇండియాపై ఉన్న అభిమానాన్ని చూపించాడు. ఆ క్రమంలోనే తన రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు జాతీయ జెండాను పోలి ఉండే విధంగా... మూడు రంగులతో డిజైన్ చేసిన వంటకాలను అందిస్తున్నాడు. ఇలా త్రివర్ణంతో కూడిన ఫుడ్ ను సర్వ్ చేయడంతో వినియోగదారులు కూడా...చాలా కొత్తగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఆర్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈ రెస్టారెంట్ యజమాని.. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ కానున్న నేపథ్యంలో తాను ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఇలా తన హోటల్ కు వచ్చే కస్టమర్స్ కు జెండా రంగుల్లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చలు కలిగి ఉండే విధంగా ఫుడ్ ను డెకరేట్ చేసి... అందిస్తున్నామని రెస్టారెంట్ ఓనర్ నితీష్ శుక్లా స్పష్టం చేశారు. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే ఉద్యమాన్ని కేంద్రం చేపట్టింది. అందులో భాగంగానే ఆగష్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.