శ్రీరాంసాగర్లోకి మొదలైన స్వల్ప వరద ప్రవాహం

శ్రీరాంసాగర్లోకి మొదలైన స్వల్ప వరద ప్రవాహం
  • ఈ సీజన్లో తొలిసారిగా 1740 క్యూసెక్కుల వరద

నిజామాబాద్ జిల్లా: రాష్ట్రంలోకి నైరుతి రుతపవనాల రాకతో జిల్లాలో వానలు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో స్వల్ప వరద ప్రవాహం మొదలైంది. ఇలా వర్షాలు ప్రారంభం కావడం ఆలస్యం.. అలా వరద ప్రవాహం మొదలుకావడం జరిగింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో కురిసిన వర్షానికి 1740 క్యూసెక్కుల వరద ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతోంది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.. సామర్థ్యం 90 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం 1064.6అడుగుల నీటిమట్టంతో 19.617 టిఎంసీల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాకతో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ పసుపు అలర్ట్ జారీ చేయడంతో శ్రీరాం సాగర్ నీటిమట్టం చకచకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏరువాక పౌర్ణమి కావడంతో రైతులు పొలాలను దుక్కి దున్నుకుని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.