కాలుష్యాన్ని ఎలా తగ్గిస్తారు.. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కళ్లుతిరిగి పడిపోతారు

కాలుష్యాన్ని ఎలా తగ్గిస్తారు.. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కళ్లుతిరిగి పడిపోతారు

విద్యార్థులు పరీక్ష రాసిన ఆన్సర్​ షీట్స్​ చూస్తే ఒక్కోసారి కోపం.. చిరాకు వస్తాయి.  ఇంకోసారి  హాస్యాన్ని తెప్పిస్తుంటాయి. సోషల్​ మీడియా వచ్చిన తరువాత అలాంటి ఆన్సర్​ షీట్స్​ వైరల్​ అవుతున్నాయి.  ఇప్పుడు అలానే ఓ జవాబు పత్రం సోషల్​ మీడియాలో ప్రత్యక్షమయింది.  వివరాల్లోకి వెళ్తే..

పాఠశాల విద్యార్థులు చదువు విషయంలో కొంతమంది సీరియస్​ గా ఉంటే మరికొంత మంది లైట్​గా తీసుకొని జోక్​ లు వేస్తూ.. సరదాగా .. హాస్యంగా ఉంటారు.  స్కూల్లోనే కాదు.. పరీక్షలు రాపేటప్పుడు కూడా ఇలానే కొంతమంది అత్యుత్సాహం చూపుతారు.  పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నకు తలతిక్క సమాధానాలు రాస్తుంటారు. కాలుష్యాన్ని ఎలా తగ్గిస్తారు..  అనే ప్రశ్నకు ఓ విద్యార్థి రాసిన జవాబును చూసిన టీచర్​ కు దిమ్మ తిరిగి మైండ్​ బ్లాంక్​ అయిన పరిస్థితి ఏర్పడింది.  ఆ తరువాత పరీక్షల్లో ఇలాంటి ప్రశ్న ఎందుకు ఇచ్చానా అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది సాధారణ ప్రశ్నే అయినా ఆ విద్యార్థి మాత్రం అద్భుతంగా సమాధానం రాశాడు. 

ఆన్సర్​ ఎలా ఉందంటే..

వైరల్​ అవుతున్న సమాధాన పత్రంలో వాహనాల నుంచి వచ్చే పొగ.. ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీరు.. కలుషితమైన గాలిని తగ్గిస్తే కాలుష్యానని నివారించవచ్చని రాశాడు.  అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత రాసే ఆన్సర్​ కంటిన్యూ చేస్తూ.. మాధురి దీక్షిత్​ సాంగ్​ను కూడా వ్రాసాడు,  నేను.. నిన్ను ప్రేమిస్తున్నాను.. నాప్రేమను దేవుడిపై ప్రమాణం చేస్తా... ప్రతిక్షణం నీకోసం ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నా... నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ నేను చాలా నిరాశగా ఉన్నా.. నేను మీకు కలిసినప్పుడు అన్నీ విషయాలు చెపుతా నంటూ జవాబు రాస్తూ.. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే తప్పకుండా కాలుష్యాన్ని నివారించవచ్చని జవాబును ముగించాడు.  ఈ పేపర్​ను మూల్యాంకనం చేసే టీచర్​ ఆ జవాబును చూసి గందరగోళానికి గురయ్యాడట. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిట్టుశర్మయిన్‌స్టా అనే ఖాతా లో ఈ ఆన్సర్​ షీట్​ పోస్టు చేయబడింది.  కొంతమంది విద్యార్థులు నోట్​ బుక్​ లో ఇలాంటి పాటలు రాయడం కొత్తేమీ కాదు గాని.. పరీక్షల్లో రాయడం ఎంతవరకు  సమంజసమో వారికే తెలియాలి.