తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం అర్ధరాత్రి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై 21 ఏళ్ల మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికులు 108కు కాల్ చేసినా స్పందన రాకపోవడంతో, అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ముస్తఫా తన ఆటోలో తల్లి, బిడ్డను తాండూరు మాతా శిశు ఆసుపత్రికి తరలించాడు.
మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజాబాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాలింత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్థిక సాయం అందించి మెరుగైన చికిత్స కోసం బాలింతను హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. పసిబిడ్డను తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.
