ప్రేమించిన అమ్మాయికి పెళ్లి..తట్టుకోలేక యువకుడు సూసైడ్

ప్రేమించిన అమ్మాయికి పెళ్లి..తట్టుకోలేక యువకుడు సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: ప్రేమలో విఫలమై ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం సీఐ సుధీర్​ కృష్ణ తెలిపిన ప్రకారం.. సూరారం శివాలయనగర్​కు చెందిన జి.అభిలాశ్(18) డిగ్రీ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్నాడు. ఇతడు  ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి 6 నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి డిప్రేషన్​లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓసారి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయినా డిప్రెషన్​లోనే ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బెట్టింగ్​ చేసి అప్పుల పాలై..

ఉప్పల్: ఆన్​లైన్​ బెట్టింగ్​ల వల్ల అప్పులపాలైన ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. యాదాద్రి జిల్లా గుండాల మండలం మాసాన్​పల్లికి చెందిన పాలడుగు సాయి(24) ఉప్పల్​ శాంతినగర్​లో నివాసముంటున్నాడు. డ్రైవింగ్​ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్​లకు బానిసై అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆదివారం పురుగుల మందు తాగాడు. దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఫైనాన్షియర్ల వేధింపులతో..

గండిపేట: శాస్త్రీపురం డైమండ్‌‌‌‌ హిల్స్‌‌‌‌లో షేక్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌(38) భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. నాంపల్లికి చెందిన ఫైనాన్షియర్లు జహంగీర్, సోహెల్‌‌‌‌ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు ఇచ్చాక కూడా వడ్డీ డబ్బులు ఇవ్వాలని ఫైనాన్సియర్లు వేధించారు. దీంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌‌‌‌కు ఉరేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు.