ఈడు మగాడ్రా బుజ్జి: జవాన్ కోసం 188 టికెట్స్.. 36 మంది గర్ల్ఫ్రెండ్స్, 72 మంది ఎక్స్గర్ల్‌ఫ్రెండ్స్‌

ఈడు మగాడ్రా బుజ్జి: జవాన్ కోసం 188 టికెట్స్.. 36 మంది గర్ల్ఫ్రెండ్స్, 72 మంది ఎక్స్గర్ల్‌ఫ్రెండ్స్‌

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah rukh khan) తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ.129 కోట్లు కలెక్ట్ చేసిన సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది జవాన్ మూవీ. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్, ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రెటీస్ కూడా క్యూ కడుతున్నారు.

ALSO READ :జవాన్ విషయంలో నయనతార హార్ట్ అయ్యిందట.. ఎందుకో?

అయితే తాజాగా వేదాంత్ అనే యువకుడు ఈ సినిమా తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేశాడు. అందులో దాదాపు 200 టికెట్స్ ను తన మేడలో వేసుకొని కనిపించాడు. ఆ ఫొటోకు.. జవాన్ సినిమా కోసం 188 టికెట్స్ బుక్ చేశాను. అందులో  36 మంచి నా గర్ల్ ఫ్రెండ్స్, 72 మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, 80 ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ రాసుకొచ్చాడు. ఆ ఫొటోను షారుఖ్‌ ఖాన్ ను ట్యాగ్ చేశాడు.

ఆ యువకుడు చేసిన ట్వీట్ కు షారుఖ్ స్పందిస్తూ.. నీ యవ్వనము ఎగసి ఎగసి పడుతుంది. హా..హా.. అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.