
జవాన్(Jawan) సక్సెస్‌తో మాసివ్ హిట్టందుకుంది నయన తార(Nayanatara). బాలీవుడ్లో తన తొలి సినిమాతోనే భారీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. బీ టౌన్ ముద్దుగుమ్మలను సైతం పక్కనపెట్టి నయన తార మాత్రమే ఈ రోల్ చేయాలని పట్టుబట్టాడట దర్శకుడు అట్లీ(Atlee). అనుకున్నట్టుగానే ఆమెకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి అభిమానం చాటుకున్నాడు. సోషల్ మీడియాలో మాత్రం ఓ రూమర్ వైరల్‌గా మారింది.
ALSO READ :మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన పవర్ స్టార్ బ్యూటీ
షారుక్‌తో పాటుగా అట్లీపై నయనతార అలకబూనిందని వార్తలు వస్తున్నాయి. జవాన్‌లో తన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. తాజాగా జవాన్ సక్సెస్ మీట్లో పాల్గొనేందుకు భర్త విఘ్నేష్‌తో కలిసి నయన్ ముంబై వెళ్లింది. ఎయిర్‌పోర్టులో వీరిద్దరినీ బాలీవుడ్ మీడియా క్లిక్‌మనిపించింది. దీంతో ఈ వదంతులకు చెక్ పడింది. ఇక ఒక్కరోజులో ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.