జనగామలో ఎలక్షన్ల నిర్వహణపై రివ్యూ

జనగామలో ఎలక్షన్ల నిర్వహణపై రివ్యూ

జనగామ అర్బన్, వెలుగు : ఈ నెల17న నిర్వహించనున్న మూడవ విడత పోలింగ్ పై జనగామ కలెక్టర్​, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్​ భాషా షేక్​ సోమవారం దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఏర్పాట్లపై అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్, జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, డీఆర్డీవో, డీఎస్​డీవో, మండల స్పెషల్​ ఆఫీసర్లు, డీఎల్పీవో, కలెక్టరేట్​ఏవో, ఈడీఎం, తహసీల్దార్లతో గూగుల్​ మీటింగ్​ద్వారా రివ్యూ చేశారు. 

డిస్ట్రిబ్యూషన్​ సెంటర్, పోలింగ్, కౌంటింగ్, ఇతర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. కౌంటింగ్​ వేగవంతంగా అయ్యేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.