వరంగల్లోని ప్రజావాణికి 117 ఫిర్యాదులు

వరంగల్లోని ప్రజావాణికి 117 ఫిర్యాదులు

కాశీబుగ్గ(కార్పొరేషన్)/ వరంగల్​ సిటీ, వెలుగు: గ్రేటర్​ వరంగల్​లోని బల్దియా హెడ్​ ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 117 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్​ చాహత్​ బాజ్​పాయ్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్​ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్వో శంకర్ లింగం, ఇన్​చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, శ్రీనివాస్, టీవో రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.