ఏడేళ్ల కూతురిని మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందపడేసిన తల్లి

ఏడేళ్ల కూతురిని మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందపడేసిన తల్లి

మేడ్చల్ మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. వసంతపురి కాలనీలో కన్నకూతురిని చంపింది ఓ తల్లి. ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని మూడో అంతస్తు  బిల్డింగ్ పై నుంచి కిందికి పడేసింది కన్నతల్లి మోనాలిసా. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్ కి తరలించగా..చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.   

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. అయితే తల్లి మోనాలిసాకు మానసిక పరిస్థితి బాగలేదని స్థానికులు చెబుతున్నారు. బిల్డింగ్ పైన ఉన్న తల్లి మోనాలిసా  చూస్తుండగానే బిడ్డను కింద పడేసిందని చెబుతున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.