జగిత్యాల జిల్లాలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్న ప్రణవి విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపగా.. తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడు.పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురైన ప్రణవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
