నర్సంపేట / నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లాలో ఈ నెల 17న నిర్వహించనున్న మూడో విడత ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల ఎంపీడీవో కార్యాలయాలను వరంగల్ కలెక్టర్ సత్యశారద సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సామగ్రి పంపిణీ, బ్యాలెట్ బ్యాక్స్లకు సీల్, లాజిస్టిక్స్ నిర్వహణ, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, భద్రతా చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.
పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీడీవో పుష్పలత, డీఎస్డీవో భాగ్యలక్ష్మి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఉన్నారు.
