ఎన్నికలకు సర్వం సిద్ధం : ములుగు కలెక్టర్ దివాకర

ఎన్నికలకు సర్వం సిద్ధం : ములుగు కలెక్టర్ దివాకర

వెంకటాపురం, వెలుగు : మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ములుగు కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం వాజేడు మండలం ఎంపీడీవో ఆఫీస్​లో ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళి పరిశీలించాలని, సిగ్నల్ లేని ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పారు. 

పోలింగ్ సిబ్బంది మంగళవారం ఉదయం 10 గంటలకు మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు చేరుకొని, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్, సామగ్రి తీసుకొని సాయంత్రం కల్లా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ, పంచాయతీ కార్యదర్శులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.