బాబీ సింహా, హెబ్బా పటేల్ జంటగా ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. మెహర్ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎస్‌కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జి కృష్ణ దాస్ డీవోపీగా, సిద్ధార్థ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌లో బాబీ సింహా మాట్లాడుతూ ‘తెలుగులో హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యాక్టర్‌ని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్ దొరికింది.
నా కెరీర్‌లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు. డిసెంబర్ 22 నుంచి వైజాగ్‌లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నామని దర్శకుడు మెహర్ అన్నాడు. నటనకు మంచి స్కోప్ ఉన్న కథ ఇదని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత యువకృష్ణ చెప్పారు.
