కీసర, వెలుగు: సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి మహా నివేదన పూర్తి చేసిన అనంతరం ఆలయ ద్వారాలను బంధించనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 5:30 గంటలకు ఆలయ సంప్రోక్షణ, ప్రత్యేక శుద్ధి కార్యక్రమాల తర్వాతే ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని, ఆపై భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.
