కొలిక్కి రాని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

కొలిక్కి రాని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక
  • రాహుల్, కేసీ​తో ఎయిర్​పోర్ట్​లో సమావేశమైన సీఎం, పీసీసీ చీఫ్

 హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఆదేశించా రు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహు ల్, కేసీ వేణు గోపాల్.. డీసీసీ చీఫ్​ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వికారాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సీఎం, పీసీసీ చీఫ్​లతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకు న్నారు.

 వీఐపీ లాంజ్​లో ఈ నలుగురు ప్రత్యేకంగా సమావేశమై రాజ్యసభ అభ్యర్థుల పేర్ల పై చర్చించారు. సుమారు అరగంటపైనే చర్చ సాగినా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాక పోవ డంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్​ను, పీసీసీ చీఫ్​ను కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకొని బుధవారం కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు.