గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అక్రమంగా పచ్చళ్లను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు లక్ష్మణ్‌రావు, డి.రమేశ్ ఆధ్వర్యంలోని బృందం, పెద్దపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ వి.అంకిత్ రెడ్డి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా లక్ష్మీనగర్‌లోని పాత రాములు హోమ్ ఫుడ్స్ దుకాణంలో ప్లాస్టిక్ డ్రమ్‌లలో నిల్వ చేసిన సుమారు 100 కేజీల మామిడికాయ పచ్చడి,100 కేజీల నిమ్మకాయ పచ్చడిని గుర్తించారు. వాటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించడంతో పాటు దుకాణ యజమానికి నోటీసు జారీ చేశారు.
అదే ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర పికిల్స్ అండ్ హోమ్ ఫుడ్స్ దుకాణంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే పచ్చళ్లను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ప్రకాశ్ వద్ద సుమారు ఐదు క్వింటాళ్ల పచ్చళ్లు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
