అందాల భామ మృణాల్ ఠాకూర్, యంగ్ హీరో అడవి శేష్ జంటగా సటించిన లేటెస్ట్ మూవీ 'డెకాయిట్'. కెమెరామెన్ షానియల్ డియా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మూవీ టీం.. 'రుబరూ' అంటూ సాగే లవ్ సాంగ్ ను విడుదల చేసింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్.
తాజాగా తిరుపతిలో 'డెయికాట్' జర్నీపై మృణాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.'ప్రొఫెషన్ కారణంగా ప్రపంచాన్ని చుట్టివచ్చే చాన్స్, కొత్త సంస్కృతులను అనుభవించే భాగ్యం, స్థానిక రుచులను ఆస్వాదించే ఆనందం, అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అదృష్టం కలుగుతుందన్నారు. ఇవన్నీ నన్ను ప్రతి రోజూ మరింతగా ఎదగనిస్తున్నా యి. నా బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి తిరుపతిలో 'డెకాయిట్' ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం నిజంగా మ్యాజిక్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది.
.
నన్నుకెమెరాలో బంధించిన ఎన్నో హార్ట్ ఫుల్ మూమెంట్స్ త్వరలో మీ ముందుకు రానున్నాయి . 'డెకాయిట్స్'కు హలో చెప్పండి!' అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది మృణాల్.. ఇక ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి జైన్ మేరీఖాన్, కామాక్షి బాస్కర్ కీలక పాత్రలో నటించారు.
ఈ మూవీని తొలుత ఈ ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేయాలి భావించారు. కానీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు. ఇప్పుడు ఎట్టకేలకు సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇదే తేదీన నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్వయంభు' విడుదల కానుంది. రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానున్న నేపథ్యంలో బాక్సాఫీవ్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
