రికార్డ్ వ్యూస్‌‌‌‌‌‌‌‌తో దేఖ్‌‌‌‌‌‌‌‌లేంగే సాలా

రికార్డ్ వ్యూస్‌‌‌‌‌‌‌‌తో దేఖ్‌‌‌‌‌‌‌‌లేంగే సాలా

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్’ నుంచి  ఇటీవల విడుదలైన  ‘దేఖ్‌‌‌‌‌‌‌‌లేంగే సాలా’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  సాంగ్ రిలీజైన  24 గంటల్లోనే  29.6 మిలియన్లకు పైగా వ్యూస్‌‌‌‌‌‌‌‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఇన్​స్టెంట్​ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన  ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తోపాటు  భాస్కరభట్ల రాసిన సాహిత్యం, విశాల్ దడ్లాని పాడిన తీరు  పాట విజయంలో కీలక పాత్ర పోషించింది. 

పవన్, హరీష్ కాంబోలో  ‘గబ్బర్ సింగ్’ తర్వాత రాబోతున్న ఈ చిత్రంలోని పాటలు కూడా  ఎవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రీన్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని మేకర్స్ చెప్పారు.  శ్రీలీల, రాశీ ఖన్నా  హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి  నిర్మిస్తున్నారు.   సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.