కూకట్ పల్లి పబ్లిక్ కు అలర్ట్... KPHB ఫోర్త్ ఫేజ్ లోని ఆర్టీఏ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది.. ఎక్కడికంటే..

కూకట్ పల్లి పబ్లిక్ కు అలర్ట్... KPHB ఫోర్త్ ఫేజ్ లోని ఆర్టీఏ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది.. ఎక్కడికంటే..

కూకట్ పల్లిలోని KPHB ఫోర్త్ ఫేజ్ లో ఉన్న ఆర్టీఏ ఆఫీసు మెట్రో కాష్ అండ్ క్యారీ దగ్గరికి షిఫ్ట్ చేసినట్లు తెలిపారు డీటీఓ మల్కాజ్ రఘునందన్. రోడ్, ట్రాఫిక్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ట్రాఫిక్ సమస్యల కారణంగా గత 18 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

ట్రాఫిక్ సమస్య రోజురోజుకి ఎక్కువవుతున్న క్రమంలో టెంపరరీ బేసిస్‌పై ఆర్టీఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయాన్ని నేటి నుంచి మెట్రో క్యాష్ అండ్ క్యారీ సమీపానికి నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. 

ఇకపై ప్రజలందరూ ఆర్టీఏకు సంబంధించిన సేవలను ఇక్కడే వినియోగించుకోవాలని కోరారు. ఆఫీసు షిఫ్ట్ అయిన విషయాన్ని గమనించి ప్రజలు ఆర్టీఏ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎం.వి.ఐ శ్రీను బాబు, అన్నపూర్ణ, కళ్యాణ్, హర్ష, ప్రభాకర్, రవీందర్, శ్రీనివాస్, సురేష్ కుమార్ యాదవ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.