హామీలపై రివ్యూ ఏదీ రాహుల్?..420 సబ్ గ్యారంటీల అమలెక్కడ?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హామీలపై రివ్యూ ఏదీ రాహుల్?..420 సబ్ గ్యారంటీల అమలెక్కడ?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సమీక్ష చేస్తారని ప్రజలు ఆశించగా, నిరాశే మిగిలిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఇచ్చి న హామీలపై జవాబుదారీతనం లేని నాయకుడి నుం చి అంతకంటే ఎక్కువ ఆశించలేమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 సబ్ గ్యారంటీల అమలెక్కడ అని ప్రశ్నించారు.

కేవలం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ టాక్స్ వసూళ్ల కోసమే పక్కా ప్రణాళికతో ఆయన పర్యటన సాగిందని ఆరోపించారు. తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటూ ఇక్కడి నిధులను కేరళ ఎన్నికలు, ఢిల్లీ రాజకీయాల కోసం తరలిస్తున్నారని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

దొడ్డిదారిన ఢిల్లీకి చెక్కేశారు: ఎంపీ కె.లక్ష్మణ్ 

ప్రజలకు సమాధానం చెప్పలేక, రాహుల్ గాంధీ దొడ్డిదారిన ఢిల్లీకి వెళ్లిపోయారని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రిటైర్మెంట్ ప్రయోజనాలు లేక వృద్ధులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.

హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చుతున్నా, లగచర్ల గిరిజనులను వేధిస్తున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విభజన రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటైందని, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.