చంద్రగ్రహణం ప్రభావం ప్రారంభమైంది. నంద్యాల జిల్లాశ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. ఈ రోజు ( మార్చి 3) తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతసేవ,ప్రాత:కాల పూజలు, మహామంగళహారతులు, తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తిచేశారు.
తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు భక్తులను శ్రీస్వామి అమ్మవారి అలంకార దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటలకు శ్రీస్వామి అమ్మవారి ఉభయ,పరివార ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మరల తిరిగి సాయంత్రం 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ .. అభిషేకం , తదితర కార్యక్రమాలను నిర్వహించి రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా .. ఈరోజు ( మార్చి 3) ఆర్జిత,శాశ్వత,పరోక్షసేవలు శ్రీస్వామి అమ్మవారి కల్యాణోత్సవ కార్యక్రమాలను ఆపేశారు. అలాగే అన్నప్రసాద వితరణ నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు.
