హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ లో నిఖిల్ కరణ్ కి సంబంధించిన స్టిల్ట్ ఫ్లోర్లను మినహాయింపుతో 10అంతస్తులు, రెండు అదనపు టీడీఆర్ ఫ్లోర్లతో 30 మీటర్ల తో కూడిన భవనానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. డోర్ నంబర్ 8-2-618/3 వద్ద ఈ బిల్డింగ్నిర్మాణాన్ని రొక్సానా ప్రాపర్టీస్ సంస్థ చేపట్టింది. 6166.06 చ.మీ స్థలంలో ఈ నిర్మాణం జరగనున్నది. 45 మీటర్ల ఎత్తుతో భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి కోరగా, 30 మీటర్ల వరకు నిర్మించుకునేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హై రైజ్ బిల్డింగ్స్ రూల్స్ప్రకారం అన్ని రూల్స్పాటించాలని, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్ వోసీ పొందాలని, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరింది. తదుపరి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు ఇచ్చారు.
