ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ.. చైన్ స్నాచింగ్లు మియాపూర్లో ఇద్దరు అరెస్ట్

ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ.. చైన్ స్నాచింగ్లు మియాపూర్లో ఇద్దరు అరెస్ట్

మియాపూర్, వెలుగు: మియాపూర్​లో మహిళ మెడలోంచి గొలుసు లాకెళ్లిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 25న మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమార్తెను కలిసేందుకు మియాపూర్​వశిష్ట కాలేజీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తోంది. ఈక్రమంలో బైక్​పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని సుమారు 70 గ్రాముల మంగళసూత్రాన్ని బలవంతంగా లాగారు. బాధితురాలు ప్రతిఘటించడంతో గొలుసులోని 10 గ్రాముల బంగారం దుండగుల చేతికి చిక్కగా, అక్కడ్నుంచి పరారయ్యారు.

దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను యూపీ, జార్ఖండ్​కు చెందిన అభయ్ కుమార్, ఆకాశ్ కుమార్​గా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ఫుడ్ డెలివరీ బాయ్స్​గా పనిచేస్తూ, ఒంటరి మహిళలే లక్ష్యంగా స్నాచింగ్​లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి 10 గ్రాముల బంగారంతో పాటు నేరానికి వాడిన బైక్​ను స్వాధీనం చేసుకున్నారు.