మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన పవర్ స్టార్ బ్యూటీ

మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన పవర్ స్టార్ బ్యూటీ

పవన్​ కల్యాన్​(Pawan kalyan) ఓజీ(OG)లో చాన్స్​ కొట్టేసిన ప్రియాంక అరుల్ మోహన్(Priyanka arul mohan)​ పేరు ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​గా మారింది. తెలుగులో వరుస ఫ్లాప్​లు చూసిన ఈ బ్యూటీ ఇక చెన్నైకి చెక్కేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఏకంగా పవన్​తో గోల్డెన్​ చాన్స్​ అందుకుంది. ఈ జోష్​లో వరుస సినిమాలకు సైన్​ చేసేస్తుందట.

ALSO READ :జవాన్ విషయంలో నయనతార హార్ట్ అయ్యిందట.. ఎందుకో?

తాజాగా దళపతి విజయ్​(Vijay thalapathy) సినిమాలో ఈ బ్యూటీని ఫిక్స్​ చేసినట్టుగా సమాచారం. లియో(Leo) వంటి భారీ ప్రాజెక్ట్​ తర్వాత విజయ్​ వెంకట్​ ప్రభు(Venakt prabhu)తో తన 68వ సినిమా చేయనున్నాడు. ఇందులో ఈ హీరోకి జోడీగా సీనియర్​ నటి సిమ్రన్​ నటిస్తుంది. ఆమెతో పాటు మరో లీడ్​ రోల్​లో ప్రియాంక ను టీం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఈ కోలీవుడ్​లో ఈ బ్యూటీ రేంజ్​ పెరిగిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.