కుర్రోళ్లోయ్.. కుర్రోళ్లు.. ఈ తరం కుర్రోళ్లు.. సోషల్ మీడియాలో జనరేషన్ జెడ్ అంటున్నారు. వీళ్లకు అస్సలు భయం లేదండీ.. అవును.. అది ఉద్యోగం అయినా.. వ్యాపారం అయినా.. జీవితం అయినా.. ఏదైనా సరే.. లైట్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్లు సాగిపోతున్నారు. ఇదంతా ఎందుకు అంటారా.. ఓ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి.. లీవ్ కోసం తన బాస్ కు మెయిల్ పెట్టాడు. ఈ మెయిల్ సారాంశం చూసిన బాస్.. ముచ్చట పడిపోయి.. వెంటనే లీవ్ ఇచ్చేశాడు.. ఇంతకీ ఆ ఉద్యోగి లీవ్ దేనికోసం అడిగాడో తెలుసా.. తన లవర్ కోసం.. తన లవర్ తో ఒక రోజు స్పెండ్ చేయటం కోసం అంట.. అవును సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టోరీ పూర్తిగా తెలుసుకుందామా..
హాయ్ సార్.. నేను డిసెంబర్ 16వ తేదీన సెలవు కోసం లెటర్ పెడుతున్నాను. నా లవర్.. నా ప్రియురాలు 17వ తేదీన.. తన సొంతూరు ఉత్తరాఖండ్ కు వెళుతుంది. మరో నెల రోజుల వరకు తిరిగి రాదు. ఆమె ఊరికి వెళ్లే ముందు.. నా లవర్ తో ఒక రోజు గడపాలనుకుంటున్నాను.. కావును డిసెంబర్ 16వ తేదీన లీవ్ ఇవ్వగలరు. మీరు సెలవు ఇస్తుంది లేనిది నాకు చెప్పండి.. ఈ విధంగా ఆ ఉద్యోగి.. తన బాస్ కు మెయిల్ చేశాడు.
మరి బాస్ లీవ్ ఇచ్చాడా అంటే.. ఇచ్చాడు.. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అంటూ రిప్లయ్ ఇచ్చి మరీ సెలవు ఇచ్చాడు. ఎందుకో తెలుసా.. ఆ ఉద్యోగి నిజాయితీకి.. అడిగిన తీరు చాలా ముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నాడు ఆ బాస్.
►ALSO READ | ఆడవాళ్లున్నది పిల్లలను కనేందుకే..కేరళ సీపీఎం నేత కామెంట్
గతం కంటే అంతా భిన్నంగా ఉంది.. ఈ తరం ఉద్యోగుల్లో కొంత నిజాయితీ ఉందంటూ చెప్పుకొచ్చాడు. గతంలో అనారోగ్యం.. హెల్త్ బాగోలేదు అనే సెలవులు మాత్రమే చూశాం.. విన్నాం.. 99 శాతం సెలవులు అనారోగ్యం కారణంగానే అడుగుతూ ఉండేవాళ్లు.. ఇప్పుడు అలా లేదు.. వెకేషన్.. ఫ్యామిలీ, లవర్ తో స్పెండ్ చేయటానికి నిర్మోహమాటంగా సెలవు అడుగుతున్నారు. ఇప్పుడు అంతా మారింది.. మారిపోయింది.. మనం కూడా మారాల్సిన సమయం వచ్చింది అంటూ ఆ బాస్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఏదిఏమైనా ఉద్యోగి, బాస్ ఇద్దరిలోనూ మార్పు కనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ తరం కుర్రోళ్లకు తగ్గట్టుగా బాస్ లు, మేనేజర్లు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
