ఆడవాళ్లున్నది పిల్లలను కనేందుకే..కేరళ సీపీఎం నేత కామెంట్

ఆడవాళ్లున్నది పిల్లలను కనేందుకే..కేరళ సీపీఎం నేత కామెంట్

మలప్పురం: ఆడవాళ్లు ఉన్నది సంసారానికేనంటూ కేరళకు చెందిన సీపీఎం నేత సయ్యద్‌‌ అలీ మజీద్‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో మలప్పురం జిల్లాలోని తెన్నాల పంచాయతీ నుంచి సయ్యద్‌‌ అలీ గెలుపొందారు. అనంతరం విజయోత్సవ ర్యాలీలో ఆయన ఈ అనుచిత కామెంట్లు చేశారు.

 ఎన్నికల బరిలో తన ప్రత్యర్థి పార్టీ అయిన ఇండియన్‌‌ యూనియన్‌‌ ముస్లిం లీగ్‌‌ మహిళా అభ్యర్థులనుద్దేశించి మజీద్‌‌ మాట్లాడుతూ.. ‘‘వారు ఓట్ల కోసం మహిళను బయటకు తీసుకువచ్చి ప్రదర్శిస్తున్నారు. మాక్కూడా ఇండ్లల్లో పెండ్లయిన మహిళలున్నారు. కానీ, మేం వాళ్లను బయటకు తీసుకురాము. వాళ్లను ఇంట్లోనే ఉండనివ్వండి. సెక్స్‌‌ కోసం, పిల్లలను కనేందుకే మహిళలను పెళ్లి చేసుకోవాలి” అని అన్నారు.