అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుకున్న ఇండియన్ స్టార్ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధం కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టు మూసివేయడంతో శనివారం నుంచి దుబాయ్ లోనే ఉండిపోయారు సింధు మంగళవారం ( మార్చి 3 ) ఉదయం దుబాయ్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు.
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ కోసం బర్మింగ్ హామ్ బయలుదేరిన సింధు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ కు దూరమయ్యింది.ఈ క్రమంలో ఇంటికి సురక్షితంగా చేరుకున్నానంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పీవీ సింధు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెడతానంటూ ట్వీట్ చేశారు పీవీ సింధు.
Back home in Bangalore and safe 🙏
— Pvsindhu (@Pvsindhu1) March 3, 2026
The last few days have been intense and uncertain, but I’m truly grateful to be back to my house. A heartfelt thank you to the incredible ground teams, Dubai authorities, airport staff, immigration, and every single person who stepped up and…
ఇవాళ జరిగే ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో సింధు పాల్గొనడం లేదని ప్రకటించింది బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ టోర్నీ కోసం మిగతా షట్లర్లు సింగపూర్, ఆఫ్రికా మీదుగా ప్రయాణించి బర్మింగ్ హామ్ కు చేరుకున్నారు. మెన్స్ షట్లర్లు లక్ష్యసేన్, ఆయుష్ షెట్టి ఎలాంటి ప్రయాణ సమస్యలు లేకుండా ఇంగ్లండ్ కు చేరారు.
మెగా టోర్నీలో లక్ష్యసేన్, డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిపై ఇండియా అంచనాలు పెట్టుకుంది. అయితే లక్ష్య సేన్ కు తొలి రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్ షి యుకీ (చైనా) రూపంలో కఠిన సవాల్ ఎదురవనుంది. ఆయుష్.. అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు.
