ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసన రాజకీయ అసమ్మతే..నర్సింహతో పాటు 9 మందికి ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ 

ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసన రాజకీయ అసమ్మతే..నర్సింహతో పాటు 9 మందికి ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ –2026లో 9 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన రాజకీయ అసమ్మతేనని ఢిల్లీలోని పాటి యాలా హౌస్ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిరసనలో హింసలేదని, ఆందోళన పేరుతో వారిని జైలులో ఉంచలేమని తేల్చి చెప్పింది. నిరసనలో పాల్గొన్న తెలంగాణకు చెందిన నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ యూత్ కో ఆర్డినేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ నరసింహ యాదవ్​తో పాటు మరో తొమ్మిది మందికి మేజిస్ట్రేట్ రవి బెయిల్ మంజూరు చేశారు.

అలాగే, కార్యకర్తలు చేసిన నిరసన కేవలం రాజకీయ అసమ్మతి మాత్రమేనని, దీన్ని వ్యవస్థీకృత నేరంగానో, హింసాత్మక చర్యగానో పరిగణించలేమని కీలక కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం నేరంకాదని గుర్తుచేశారు. నాయకుల చిత్రాలున్న టీ-షర్టులు ధరించి, నినాదాలు చేయడం ప్రతీకాత్మక విమర్శ మాత్రమే అని వ్యాఖ్యానించారు.