ITI చేసిన వారికి రైల్వేలో ఉద్యోగ ఆఫర్: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. మెరిట్ ఉంటే చాలు!

ITI చేసిన వారికి రైల్వేలో ఉద్యోగ ఆఫర్: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. మెరిట్ ఉంటే చాలు!

రైల్ వీల్ ఫ్యాక్టరీ (ఆర్ డబ్ల్యూఎఫ్)  అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 01. 

ఖాళీలు: 192.

విభాగాల వారీగాల ఖాళీలు: ఫిట్టర్ 85, మెషినిస్ట్ 31, మెకానికల్ (మోటార్ వెహికల్) 8, టర్నర్ 5, సీఎన్​సీ ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) 23, ఎలక్ట్రీషియన్ 18, ఎలక్ట్రానిక్ మెకానికల్ 22. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి . సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేయడంతోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 15 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 28.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.100 చెల్లించాలి.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 1. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్స్​లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు rwf.indianrailways.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.