శివ్వంపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చెంది గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఏర్పాటు చేయగా, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉద్యోగులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీఓ తిరుపతిరెడ్డి ఉన్నారు.
