Balakrishna : 'అఖండ 2: తాండవం' బాక్సాఫీస్ జోరు.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే?

Balakrishna : 'అఖండ 2: తాండవం' బాక్సాఫీస్ జోరు.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనిను కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్విల్ 'అఖండ 2: తాండవం' . మాస్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆర్థిక, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, వారం రోజులు ఆలస్యంగా, డిసెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిలకడైన వసూళ్లను సాధిస్తోంది. బాలయ్య సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

తొలి వారంలో వసూళ్లు..

నిజానికి, రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, పలు లీగల్ సమస్యల కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన తేదీని డిసెంబర్ 12కు మార్చారు. తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తొలి వీకెండ్‌లో వసూళ్లు కొంత హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, నివేదికల ప్రకారం, మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 65 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలయ్య  'తాండవం' ..

'అఖండ 2' లో బాలకృష్ణ మరోసారి శక్తివంతమైన అఘోరా, మురళీ కృష్ణగా ద్విపాత్రాభినయంలో మెస్మరైజ్ చేశారు. ఈసారి అఘోరా.. అన్యాయంపై దైవశక్తితో చేసే పోరాటం, గూస్‌బంప్స్ తెప్పిస్తోందని అభిమానులు అంటున్నారు. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటన, బాలకృష్ణకు ధీటుగా ఉంది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఎస్. థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా భక్తి, యాక్షన్ నేపథ్య సంగీతం సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది.

డబుల్ హ్యాట్రిక్ దిశగా

65 ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ ఆరు హిట్లు వరుసగా సాధించి డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఈ మూవీలో అఘోర పాత్రలో మెప్పించారు. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంది.  గత మూడు హిట్ చిత్రాల తర్వాత వచ్చిన 'అఖండ 2', ఈ విజయపరంపరలో నాలుగో మెట్టు అవుతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.

ఓటీటీలో ఎప్పుడు?

థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ, అభిమానుల దృష్టి ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీపైనే ఉంది. 'అఖండ 2' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. నిర్మాతలు సాధారణంగా సినిమా విడుదలకు 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ నియమం ప్రకారం, 'అఖండ 2' జనవరి 9, 2026 నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే, సినిమా ఆలస్యంగా విడుదలవడం, అలాగే థియేటర్లలో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోతే, ఓటీటీ విడుదల తేదీ కొంత ముందుకు లేదా వెనక్కి జరిగే అవకాశం ఉంది. జనవరిలో సంక్రాంతి సీజన్‌ను పురస్కరించుకుని ఈ సినిమాను డిజిటల్‌లో విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తదుపరి చిత్రం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉంటుందని ప్రకటించారు. 'అఖండ 2' థియేటర్ రన్ ఎన్ని వారాలు కొనసాగుతుందో చూడాలి.