వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ 'బైకర్' (Biker) ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'యాంగ్రీ యంగ్ మ్యాన్' డాక్టర్ రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
'బుల్లెట్ సునీల్'గా రీ-ఎంట్రీ!
ఈ రోజు (ఫిబ్రవరి 4) డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన 'బుల్లెట్ సునీల్' అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఒకప్పుడు మోటోక్రాస్ రేసింగ్‌లో తిరుగులేని ఛాంపియన్‌గా వెలిగి, ప్రస్తుతం భారతీయ రేసర్లను ప్రపంచ వేదికపై విజేతలుగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్న కోచ్‌గా రాజశేఖర్ కనిపించబోతున్నారు. ఈ గ్లింప్స్‌లో రాజశేఖర్ లుక్, ఆయన నడక, గంభీరమైన వాయిస్ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఆయనను ఇంత ఎనర్జిటిక్ పాత్రలో చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. రాజశేఖర్ గారు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
స్పోర్ట్స్ డ్రామాలో సరికొత్త యాంగిల్
అభిలాష్ రెడ్డి కంకణ దర్శకత్వంలో ఈ చిత్రం ప్యూర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. సాధారణంగా మన దగ్గర క్రికెట్ లేదా కబడ్డీ నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి, కానీ బైక్ రేసింగ్ (Motocross) నేపథ్యంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ మూవీలో శర్వానంద్ ఒక ఉత్సాహవంతుడైన రేసర్‌గా, రాజశేఖర్ ఆయనకు దిశానిర్దేశం చేసే మెంటర్‌గా కనిపిస్తారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. జిబ్రాన్ సంగీతం, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి.
బాక్సాఫీస్ వద్ద రయ్ రయ్!
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2026, ఏప్రిల్ 3న 'బైకర్' థియేటర్లలోకి రానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లోనే అతిపెద్ద మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ 'బుల్లెట్ సునీల్' పాత్ర ఒక గట్టి పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. శర్వానంద్ ఫామ్, రాజశేఖర్ అనుభవం, సరికొత్త బైక్ రేసింగ్ కాన్సెప్ట్.. ఇవన్నీ కలిపి 'బైకర్' మూవీని 2026 మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలబెట్టనున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
