Mega OTT Move: అఫీషియల్.. ఓటీటీలోకి మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ – స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Mega OTT Move: అఫీషియల్.. ఓటీటీలోకి మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ – స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVPG) . సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో దాదాపు ఒక నెల రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ:

“మన శంకర వరప్రసాద్ గారు” మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఏడు భాషల్లో కావడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో రానుంది.

ఈ విషయాన్ని జీ5 తన ప్లాట్‌ఫామ్లో కన్ఫమ్ చేసింది. అయినప్పటికీ, డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ మూవీ గురించి జీ5లో సెర్చ్ చేసినప్పుడు,స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఫిబ్రవరి 11 అని ఉంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ మూవీ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇకపోతే, ఈ మూవీ పంచవ్యాప్తంగా రూ.360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించడంతో పాటు మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.