భయం.. భయం.. ఇది ఒక్కటి చాలు మనిషిని చంపేయటానికి.. అవును.. బెంగళూరు సిటీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. బెంగళూరు సిటీలోని బ్రూక్ ఫీల్డ్ ఏరియా. ఇక్కడ సీ ఎస్టా అనే హోటల్ ఉంది. ఈ హోటల్ లో జరిగిన పార్టీ.. ఆ తర్వాత పోలీసులపై విమర్శలకు దారి తీసింది. సిటీలోనే చర్చనీయాంశం అయిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు సిటీకి చెందిన కొంత మంది యువతీ యువకులు హోటల్ లో పార్టీ కోసం మూడు గదులు బుక్ చేసుకున్నారు. ప్లానింగ్ ప్రకారం ఆదివారం పార్టీకి వచ్చారు అందరూ. పార్టీలో భాగంగా డీజే సౌండ్స్, పెద్ద పెద్దగా అరుపులు, కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్ చుట్టుపక్కల వాళ్లకు ఇది ఇబ్బందిగా మారింది. అర్థరాత్రి వరకు కూడా సౌండ్స్ ఆగకపోవటంతో కంప్లయింట్ చేశారు చుట్టూ ఉన్నవారు.
అర్థరాత్రి తర్వాత పోలీసులు హోటల్ దగ్గరకు వచ్చారు. కంప్లయింట్ పై విచారణ చేశారు. పార్టీ చేసుకుంటున్న వాళ్లను మందలించారు. పోలీసుల వైఖరితో భయపడిపోయిన ఓ యువతి.. హోటల్ లోని తన గదిలోని బాల్కనీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేసింది. బాల్కనీకి ఆనుకుని ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ పట్టుకుని.. నాలుగో అంతస్తు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేసింది. అనుకోకుండా పట్టుతప్పి.. నాలుగో అంతస్తు నుంచి కింద పడింది ఆ యువతి.
కింద పడిన యువతికి తీవ్ర గాయాలు కావటంతో ఫ్రెండ్స్ ఆస్పత్రికి తరలించారు. కండీషన్ సీరియస్ గా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ ఘటనలో పోలీసుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. పార్టీ చేసుకుంటున్న వాళ్ల నుంచి పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారని.. పార్టీలోని వాళ్లను పోలీసులు బెదిరించటం వల్లనే.. భయపడిన ఆ అమ్మాయి కిందకు దిగే ప్రయత్నం చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు స్పందించారు. కంప్లయింట్ ఆధారంగా వెళ్లిన మేము.. కేవలం మందలించాం అని.. డబ్బులు డిమాండ్ చేయలేదని.. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి తండ్రి మాత్రం.. పోలీసులను విచారించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారాయన. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
2025, డిసెంబర్ 14వ తేదీ రాత్రి హోటల్ లో పార్టీ జరుగుతుంది. ఈ పార్టీలో పెద్ద సౌండ్ లో మ్యూజిక్ ప్లే చేశారు. అరుపులు, కేకలు వస్తున్నాయంటూ హోటల్ చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు.. అర్థరాత్రి సమయంలో హోటల్ దగ్గరకు వచ్చారు.
