కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. గ్రామంలో ఓడిన అభ్యర్థి పైకి గెలిచిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బలరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ సత్యవ్వ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన లేక ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తు్న్నారు.
