ఆధార్ తోనూ నగదు లావాదేవీలు

ఆధార్ తోనూ నగదు లావాదేవీలు

రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలకు ఇకపై పాన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును వాడొచ్చు. పాన్‌ అవసరమైన ప్రతి చోట దానికి బదులుగా ఆధార్‌ను కూడా వాడుకోవచ్చని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్​డ్రాలకు ఆధార్ నంబర్​ను వినియోగించవచ్చని తెలిపింది. శనివారం పాన్ ప్లేస్​లో ఆధార్​ను కూడా అంగీకరించేలా బ్యాంకులు, ఇతర సంస్థలు అప్​గ్రేడ్ అవ్వాలని కేంద్ర రెవెన్యూ శాఖ సెక్రెటరీ అజయ్ భూషన్​పాండే ఆదేశించారు. ప్రస్తుతం ఆధార్​తో లింక్​అయిన 22 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. 123 కోట్ల మందికి పైగా ఆధార్‌ కార్డులు ఉన్నాయి. పాన్‌ బదులు ఆధార్‌కు అవకాశం కల్పించడం ద్వారా ఆధార్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఐటీ శాఖ నిఘా పరిధిలోకి రానున్నారు.