పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం

పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం

పాట్నా: బిహార్ లో అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేలిన ఓ మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి పెరోల్ పై బయటకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా రోడ్ షో నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అనంత్ కుమార్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్  అనే ఆ లీడర్ మెక్మా నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయుధాల కేసులో దోషిగా తేలడంతో 10 ఏండ్ల శిక్ష పడింది. పాట్నాలోని బార్హ్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. 

ఆయనకు 15 రోజుల పెరోల్ లభించడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. ముంగేర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి లలన్ సింగ్ కు మద్దతుగా అనంత్ కుమార్ సింగ్ ఈ మేరకు భారీ రోడ్ షో చేపట్టి ప్రచారంలో పాల్గొన్నారు.