MS Dhoni Retirement: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. వయసు, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అతడు త్వరలో ప్రారంభమయ్యే సీజన్‌లో కేవలం 'ఇంపాక్ట్ ప్లేయర్' గానే ఆడుతాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ కథనాలపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అనేది ఫుట్‌బాల్ గేమ్ కాదు, మ్యాచ్ మధ్యలో వచ్చి కేవలం 10 నిమిషాలు ఆడి వెళ్లిపోవటానికి.. ఒకవేళ ధోనీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో లేకపోతే, గౌరవప్రదంగా క్రికెట్ నుంచి తప్పుకోవడమే అతనికి మంచిదన్నాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు ఫ్రాంచైజీ ఇప్పటికే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అలాగే ధోనీ స్థానంలో వికెట్ కీపింగ్ చేసేందుకు సంజు శాంసన్ కూడా తుది జట్టులోకి వచ్చాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. రుతురాజ్, శాంసన్ లాంటి యంగ్ ప్లేయర్స్ జట్టులో కీలక పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నప్పుడు ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాల్సిన అవసరం ఏముందని క్వశ్చన్ చేశాడు. ఒకవేళ మహేంద్రుడు ఆడితే అది కేవలం జట్టులో ఒక ప్లేస్ ని చేసేందుకు అవుతుందని ఆరోపించాడు. అందుకే 2026 ఐపీఎల్ సీజన్ ధోనీకి బహుశా చివరిది అయ్యే ఛాన్స్ ఉందని చోప్రా వెల్లడించాడు.
►ALSO READ | ఇది న్యాయమేనా కావ్య పాప..! ఉప్పల్ స్డేడియం ముందు మెరుపు ధర్నా.. ఎందుకంటే..?
క్రికెట్ అభిమానులు సైతం ఎంఎస్ ధోనీని ఒక గొప్ప నాయకుడిగానే చూడాలని అనుకుంటారు.. కానీ, ఇలా సగం ప్లేయర్ గా చూడలేరని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ధోనీ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ అనూహ్య పరిణామం క్రీడా ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాగా బీసీసీఐ ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ నిబంధన ప్రకారం లీగ్ లోని అన్ని జట్లు తమ అవసరాన్ని బట్టి ఒక ఆటగాడిని మ్యాచ్ మధ్యలో మార్చుకునే అవకాశం కల్పించింది. ధోనీ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడు. అందుకే అతను స్టేడియంలో కీపింగ్ చేస్తూ, లాస్ట్ లో బ్యాటింగ్ కి వస్తున్నాడు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్ కు అతను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని ప్రచారం జరుగుతుంది.
